Header Banner

టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక! గెలుపు లక్ష్యంగా ఈ రోజే పని ప్రారంభించండి!

  Fri Feb 28, 2025 15:45        Politics

పార్టీని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అన్నారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ కేడర్‌కు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈ రోజు నుంచే పని చేయాలని కేడర్‌కు సూచించారు. రాబోయే ఎన్నికల్లో మీరందరూ మళ్లీ గెలవాలని అన్నారు.


ఇది కూడా చదవండి: 2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ? రాష్ట్రాల వారీగా ఇలా..!


ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నాయకుల పని తీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని చెప్పారు. తాను త్వరలో మిమ్ములను పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతానని అన్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించారు. అందుకనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని చెప్పారు. మీరు వాళ్లు కలుపుకొని వెళ్తేనే ముందుకెళ్లగలుగుతామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పనులు గురించి కూడా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #CBN #todaynews #flashnews #latestnews